భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక మండలాల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన వృద్ధ దంపతులు గత ఐదు రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. భర్తకు గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్నాయి. ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ నాగ ప్రసాద్.. సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పినపాక నియోజకవర్గంలో కరోనా పంజా.. ఒక్కరోజే ముగ్గురు మృతి - corona deaths in pinapaka constituency
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా విశ్వరూపం కొనసాగుతోంది. పినపాక నియోజకవర్గంలో ఒక్క రోజే ముగ్గురు వృద్ధులు కొవిడ్ బారిన పడి మృతి చెందారు.
కరోనాతో వృద్ధులు మృతి
సమితి సింగారం గ్రామానికి చెందిన వృద్ధురాలికి(60) ఈ నెల 12న కరోనా సోకింది. దానికి తోడు ఆస్తమా వ్యాధి ఉండటంతో 19న ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. పినపాక మండలానికి చెందిన వృద్ధురాలు(65) మహమ్మారి బారిన పడి మృత్యు ఒడికి చేరింది.
ఇదీ చదవండి:దారుణం: తండ్రిని పొడిచి చంపిన తనయుడు