భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ముగ్గురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ ముందు ఇద్దరు పురుషులు, ఒక మహిళ మావోయిస్టులు లొంగిపోయారు. ములకలపల్లి గ్రామానికి చెందిన మడకం మారయ్య, మడకం పాండు, మడకం చుక్కమ్మ.. చాలాకాలం నుంచి మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం మావోయిస్టులు అవలంబిస్తున్న సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారు మావోయిస్టుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎఎస్పీ వెల్లడించారు. ఈ ముగ్గురికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందిస్తామని ఏఎస్పీ తెలిపారు. మిగతా మావోయిస్టులు కూడా.. స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఏఎస్పీ తెలిపారు.