తెలంగాణ

telangana

ETV Bharat / state

సున్న రాజయ్య నిరాండబరుడు.. ఆయన మృతి విచారకరం : ఎమ్మెల్యే వీరయ్య - badrachalam latest news

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సున్నం రాజయ్య చిత్రపటానికి వీరయ్య నివాళులర్పించారు.

సున్న రాజయ్య నిరాండబరుడు.. ఆయన మృతి విచారకరం : ఎమ్మెల్యే వీరయ్య
సున్న రాజయ్య నిరాండబరుడు.. ఆయన మృతి విచారకరం : ఎమ్మెల్యే వీరయ్య

By

Published : Aug 4, 2020, 4:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మరణం పట్ల శాసనసభ్యుడు పొదెం వీరయ్య నివాళులు అర్పించారు. అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం చెందడంపై వీరయ్య విచారం వ్యక్తం చేశారు. కరోనా వైరస్​ బారిన పడి చనిపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భద్రాచలం ప్రజలకు ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. రాజయ్య మృతి పట్ల నియోజకవర్గ ప్రజలంతా కన్నీరుమున్నీరు అవుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు కష్ట కాలం నుంచి త్వరగా కోలుకోవాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details