తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి తిరువీధుల్లో ఊరేగిన స్వామివారు - భద్రాద్రి బ్రహ్మోత్సవాల వార్తలు

Thirukalyana Brahmotsavam: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. నేడు భద్రాచలంలో మంత్రి పువ్వాడ పర్యటించనున్నారు. సీతారాముల కల్యాణ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

thiru kalyana brahmotsavam
తిరువీధుల్లో ఊరేగుతున్న స్వామివారు

By

Published : Apr 4, 2022, 5:16 AM IST

Thirukalyana Brahmotsavam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈనెల 16 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయంలోని ప్రధానమూర్తులను నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి దర్బార్​ సేవ నిర్వహించారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాములను తిరువీధుల్లో ఊరేగించారు.

తిరువీధుల్లో ఊరేగుతున్న స్వామివారు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 6న అంకురార్పణ జరగనుంది. ఈనెల 9 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. 9వ తేదీన ఎదుర్కోలు మహోత్సవం, 10న సీతారాముల కల్యాణం, 11న మహా పట్టాభిషేకం జరగనున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ నేడు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సీతారాముల కల్యాణం ఏర్పాట్లుపై సమీక్షిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 2 నుంచి 16 వరకు నిత్య కల్యాణాలు నిలిపేశారు.

ఇదీచూడండి:YADADRI TEMPLE: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details