భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మాస్కులు అందజేశారు. సుమారు పది వేల మాస్కులను కౌన్సిలర్లకు పంపిణీ చేశారు. మాస్కుల పంపిణీకి సింగరేణి మర్చంట్, క్లాత్ మర్చంట్, ఐరన్ షాప్స్ అసోసియేషన్, ఎన్నారైలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు.
భౌతిక దూరం పాటిస్తూ పంపిణీ చేయాలి - మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇల్లెందు పట్టణంలో ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యేొ కోరారు.
భౌతిక దూరం పాటిస్తూ పంపిణీ చేయాలి
ఈ ప్రాంత ప్రజలకు సాయం చేయడానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఎన్నారైలు ప్రకటించడం సంతోషకరమన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేసే సమయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ వేణుచందర్, వైస్ ఛైర్మన్ జానీ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :లాక్డౌన్ సమయంలో స్మృతి ఏం చేస్తుందో తెలుసా!