భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన తెరాస నాయకుడు, ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును క్షేమంగా విడిచిపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. మావోయిస్టుల చేతిలో అపహరణకు గురైన శ్రీనివాసరావు... 3 రోజులుగా వారి చెరలోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీనివాసరావు రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నలుగురికి సాయం చేసే గుణమే తప్ప... ఎవరికీ అన్యాయం చేయలేదని శ్రీనివాసరావు భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు తన తండ్రిని క్షేమంగా వదిలేయాలని ఆయన కొడుకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాడు. శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఎంపీటీసీ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ - తెరాస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన తెరాస నాయకుడు, ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నలుగురికి సాయం చేసే వ్యక్తే తప్ప ఎవరికి కీడు చేయడని కుటుంబసభ్యులు అంటున్నారు.
ఎంపీటీసీ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఇవీ చూడండి: చెరువులో టిక్‌టాక్ చేస్తూ యువకుని మృతి