తెలంగాణ

telangana

లాక్‌డౌన్ వేళ... ఉమ్మడి ఖమ్మంలో నేరాలకు తాళం

కరోనా మహమ్మారి ప్రజానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ఇంకోపక్క లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనం ఇంటిపట్టునే ఉంటుండటంతో నేరాలు తగ్గాయి. ఘోరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గతం మాదిరిగా రహదారి ప్రమాదాలు లేవు. ఫలితంగా ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గిపోయింది. అత్యాచారాలు, అపహరణ కేసులు అదుపులోకి వచ్చాయి. పగటి పూట దొంగతనాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి.

By

Published : Apr 23, 2020, 2:56 PM IST

Published : Apr 23, 2020, 2:56 PM IST

The number of crimes decreased in the wake of a nationwide lock down in India
లాక్‌డౌన్ వేళ... ఉమ్మడి ఖమ్మంలో నేరాలకు తాళం

లాక్​డౌన్​ వల్ల ఖమ్మం కమిషనరేట్‌ పరిధితోపాటు భద్రాద్రి జిల్లాలోనూ నేర తీవ్రత రోజుల వ్యవధిలో తగ్గిపోయింది. నెల రోజుల వ్యవధిలో నేరాల, ఘోరాల సంఖ్యను గతేడాది ఈ రోజులతో పోల్చిచూసినట్టయితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

భద్రాద్రి జిల్లాలో పరిస్థితి ఇదీ...

* చిల్లర దొంగతనాలు 21.42 శాతానికి పరిమితమయ్యాయి.

* పగటి దొంగతనాలు లేవు. రాత్రి దొంగతనాలు ఒకటి పెరిగాయి.

* హత్యలు అపుడు, ఇపుడూ ఏమీలేవు.

* కిడ్నాప్‌లు శూన్యం.

* అత్యాచారాలు 25 శాతానికే పరిమితమయ్యాయి.

* చిన్నపాటి ఘర్షణలు, చీటింగ్‌లు తగ్గుముఖం పట్టాయి.

* రోడ్డు ప్రమాదాలు 26.66 శాతానికి పరిమితమయ్యాయి.

* రోడ్డు ప్రమాద క్షతగాత్రులు 31.57 శాతం నమోదయ్యాయి.

* మిస్సింగ్‌ కేసులు 81.25 శాతంగా గుర్తించారు.

ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో తగ్గిన నేరాలు

* పగటి దొంగతనాల ఊసేలేదు.

* రాత్రి దొంగతనాలు 41.66 శాతానికి పరిమితమయ్యాయి.

* కిడ్నాప్‌లు తగ్గాయి. కేవలం 27.27 శాతానికే పరిమితం అయ్యాయి.

* అత్యాచారాలు తగ్గిపోయాయి.

* మోసపూరిత ఘటనల సంఖ్య గణనీయంగా తగ్గగా, చిన్నపాటి ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి.

* 17.30 శాతానికి రోడ్డు ప్రమాదాలు పరిమితం కాగా మృతుల శాతం 41.17 శాతానికి పరిమితమైంది.

* మిస్సింగ్‌ కేసులు 33.33 శాతానికి తగ్గిపోయాయి.

వీరిని ఏమనాలో..?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటు చూసినా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మందులు, ఆసుపత్రి చికిత్సల కోసం బయటకు వచ్చేవారు కొద్ది సంఖ్యలోనే ఉంటున్నారు. అవసరంగా లేకున్నా కొందరు అదే పనిగా రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొద్ది సంఖ్యలో జరుగుతున్నాయి. ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో నెల రోజుల్లో 12 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రమాదాలకు గురయ్యారంటే చోదక తీరు చెప్పాల్సిన పనిలేదు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details