భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇల్లందు మున్సిపాలిటీ ఉత్తమంగా నిలిచిందని అదనపు కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి కోసం నిధులు పొందినట్లు తెలిపారు. కౌన్సిలర్లు వారి వార్డులో ప్రగతికి కృషి చేయాలని సూచించారు. ఇతర వార్డుల వారీతో పోటీ పడుతూ పనిచేయాలన్న అనుదీప్.. ఏవైనా సమస్యలుంటే పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు.
రూ.12 కోట్లతో ఇల్లందు పురపాలిక బడ్జెట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ బడ్జెట్ రూ.12 కోట్ల వ్యయంతో రూపొందించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దు రూపొందించినట్లు వెల్లడించారు.
ఇల్లందు పురపాలిక, ఇల్లందు బడ్జెట్
ఇల్లందు మున్సిపాలిటీ బడ్జెట్ రూ.12 కోట్ల వ్యయంతో రూపొందించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దు రూపొందించినట్లు చెప్పారు. వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.
- ఇదీ చదవండి :ఆ చట్టానికి పాతికేళ్లైనా.. అట్టడుగునే ఆదివాసులు!