తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని రక్షించాలి: ఛైర్మన్ - తెలంగాణ వార్తలు

సింగరేణి కుటంబ సభ్యుల ఆరోగ్యాన్ని రక్షించాలని ఛైర్మన్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. ఇప్పటికే 20 మంది డాక్టర్లను ఒప్పంద పద్ధతిలో నియమించామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 700 పడకలకు అదనంగా మరో 500 పడకలను సమకూర్చామని చెప్పారు.

singareni chairman sridhar, singareni employees health review
సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యంపై సమీక్ష, సింగరేణి ఛైర్మన్ సమీక్ష

By

Published : Apr 30, 2021, 8:31 PM IST

సింగరేణి కార్మికులను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ కొవిడ్ నివారణ చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని సింగరేణి ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఖర్చుకు వెనకాడకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పెద్ద ఎత్తున చేయాలని, లక్షణాలు ఉంటే క్వారంటైన్​లో ఉంచి వైద్య సేవలు అందించాలని చెప్పారు. మే నెలలో మొదటి డోసు వ్యాక్సిన్, జులైలో రెండో డోసు ఇవ్వాలని తెలిపారు.

డాక్టర్లను, టెక్నీషియన్లను, సహాయ వైద్య సిబ్బందిని ఏరియాల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిలో వెంటనే నియమించుకోవాలని సూచించారు. ఏరియాలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఏరియా జీఎంలు స్థానిక ఆస్పత్రులను సందర్శించాలని, ఆక్సిజన్ కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొవిడ్​కు సంబంధించిన ఇంజక్షన్లు, మందులు మరో రెండు నెలలకు సరిపడా ఏరియా ఆస్పత్రిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంబులెన్సుల సంఖ్య సరిపోకపోతే తక్షణమే ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొవిడ్ రాపిడ్ టెస్టుల కోసం రూ.50 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. 20 మంది డాక్టర్లను ఇప్పటికే ఒప్పంద పద్ధతిలో నియమించామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఆస్పత్రుల్లో కనీసం రెండు వందల మందికి టీకా ఇవ్వాలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 700 పడకలకు అదనంగా మరో 500 పడకలను సమకూర్చామని చెప్పారు.

సింగరేణి కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్న విషయాన్ని ప్రతి అధికారి గుర్తించాలని… కార్మికులందరికీ భరోసా కల్పించాలని సూచించారు. జాతీయస్థాయిలో సింగరేణికి మంచి పేరు వచ్చిందని, ఈసారి అదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్స్ ఎన్.బలరాం, జనరల్ మేనేజర్ కార్పొరేషన్ కె.సూర్యనారాయణ, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, డైరెక్టర్ ఈఅండ్ఎం డి.సత్యనారాయణ, సీఎంవో డాక్టర్ మంతా శ్రీనివాస్ అన్ని ఏరియాల నుంచి జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'భయపడకుండా... సరైనా జాగ్రత్తలు తీసుకోవటమే అసలైన వాక్సినేషన్​'

ABOUT THE AUTHOR

...view details