తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి ఛైర్మన్ కొనసాగింపుపై కేంద్రం అభ్యంతరం - telangana news

సింగరేణి ఛైర్మన్ కొనసాగింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సింగరేణి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సర్కార్​ నిర్ణయానికి మెజార్టీ ఓట్లు రావడం వల్ల సీఎండీగా శ్రీధర్ యథాతథంగా కొనసాగుతారని సింగరేణి ప్రకటించింది.

the-center-objected-to-the-continuation-of-the-singareni-chairman-sridhar
సింగరేణి ఛైర్మన్ కొనసాగింపుపై కేంద్రం అభ్యంతరం

By

Published : Jan 1, 2021, 12:03 PM IST

సింగరేణి 99వ వార్షిక సమావేశం కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో సాధారణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, డివిడెంట్ చెల్లింపు, డైరెక్టర్ల జీత భత్యాలకు ఆమోదం తదితర అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతుంటారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమావేశంలో ఆడిట్​లో క్లీన్ చిట్ సాధించిన వార్షిక అకౌంట్లను ఆమోదించింది.

సింగరేణి ఛైర్మన్ కొనసాగింపుపై కేంద్రం అభ్యంతరం

ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వ్యతిరేకించారు. సభ్యుల్లో ఒక్కరు మాత్రమే వ్యతిరేకించడం, మిగిలిన ఐదుగురూ అనుకూలంగా ఓటు వేయడంతో అసమ్మతి వీగిపోయింది. ఫలితంగా ఛైర్మన్ శ్రీధర్ యథాతథంగా కొనసాగుతారని సింగరేణి ప్రకటించింది.

సీఎండీగా శ్రీధర్ కొనసాగింపును పలు సింగరేణి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే వ్యక్తిని కొనసాగించటాన్ని విమర్శిస్తున్నాయి. సంస్థను ప్రభుత్వానికి కట్టబెట్టినట్లుగా ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఛైర్మన్‌గా శ్రీధర్ పనిచేసిన కాలంలో జరిగిన పలు అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details