భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజీవ్ గృహకల్ప నిర్మాణాలు శిథిలమవుతున్నాయి. ఇక్కడ నిర్మించిన సెప్టిక్ ట్యాంకులు ప్రమాదకరంగా మారాయి. మూడు రోజుల కింద తప్పిపోయిన ఓ గేదె రాజీవ్ గృహకల్ప సమీపంలో సెప్టిక్ ట్యాంకులో పడిపోయింది.
మూడు రోజులు తర్వాత ప్రాణాలతో బయటపడ్డ గేదె - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
మూడు రోజులుగా చావుతో పోరాడిన ఓ గేదె చివరకు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగింది.
![మూడు రోజులు తర్వాత ప్రాణాలతో బయటపడ్డ గేదె he buffalo that survived the accident in badradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9335196-183-9335196-1603820270297.jpg)
మూడు రోజులు తర్వాత ప్రాణాలతో బయటపడ్డ గేదె
మూగ జీవి రోదనలు గమనించిన స్థానికులు.. దగ్గరికి వెళ్లి పరిశీలించగా గేదె ఉన్నట్లు గుర్తించారు. సిమెంటు నిర్మాణాలతో బలంగా ఉన్న సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాన్ని స్థానిక నాయకుడు సత్యనారాయణ జేసీబీ సాయంతో ఒకవైపు నుంచి పగులగొట్టగా.. గేదె బయటకు వచ్చింది.