భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వేదపండితులు ప్రతిరోజూ తిరుప్పావై ప్రవచనాలను పారాయణం చేస్తున్నారు. అందులో భాగంగానే నేడు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 వెండి పాత్రలలో పరమాన్నం ఉంచి నివేదన చేశారు. అనంతరం శ్రీకృష్ణ గోదాదేవి స్తోత్రాలు పారాయణం చేశారు. ఈ ఉత్సవంలో మహిళలు పాల్గొని సామూహిక కుంకుమార్చనలు చేశారు.
భద్రాద్రి రామయ్య ఆలయంలో ఘనంగా కుడార్తె ఉత్సవం - భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కూడారై ఉత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది.
భద్రాద్రి రామయ్య ఆలయంలో ఘనంగా కుడార్తె ఉత్సవం