తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు - ennikala counting

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు

By

Published : Jun 4, 2019, 12:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే 6,10,14న జరిగిన మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. అశ్వాపురం, బూర్గంపాడు మండల ఓట్లు భద్రాచలంలో... గుండాలపల్లి ఓట్లు ఇల్లందులో... పినపాక, మణుగూరుకు చెందిన ఓట్లు మణుగూరు జిల్లా పరిషత్​ పాఠశాలలో లెక్కిస్తున్నారు. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లెక్కింపు కేంద్రాల్ని కలెక్టర్​,ఏఎస్పీ పరిశీలించారు.

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details