తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెరాస కార్యకర్తలు - సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెరాస కార్యకర్తలు

సీతారామ ప్రాజెక్టు నుంచి ఇల్లందు నియోజక వర్గానికి లక్షా 54 వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Teresa activists who were anointed to paint the CM
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెరాస కార్యకర్తలు

By

Published : Sep 19, 2020, 12:41 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని 5 మండలాలకు లక్షా 54 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం.. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెరాస నాయకులు తెలిపారు.

ముఖ్యమంత్రి స్పందించడం పట్ల తెరాస నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మండల, పట్టణ తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :పెంజ్ బాక్స్.. అద్భుతమైన స్వదేశీ యాప్

ABOUT THE AUTHOR

...view details