తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నులపండువగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం - bhadrachalam temple

భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో తెప్పోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. రాజ లాంఛనాలతో, మేళతాళాల మధ్య లక్ష్మణ సమేత సీతారాములు పుష్కరిణికి చేరుకున్నారు.

teppotsavam to lord rama at bhadradri temple
కన్నులపండువగా భద్రాద్రి రామయ్యకు తెప్పోత్సవం

By

Published : Dec 24, 2020, 7:22 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు లక్ష్మణ సమేత సీతారాములకు అంగరంగవైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు.

కన్నులపండువగా భద్రాద్రి రామయ్యకు తెప్పోత్సవం

రాజ లాంఛనాలు, మేళ తాళల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనంపై లక్ష్మణ సమేత సీతారాములు పుష్కరిణికి చేరుకున్నారు. ప్రతి ఏడాది గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం.. కరోనా కారణంగా ఈ ఏడు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు, ఉద్యోగులు, పరిమిత సంఖ్యలో భక్తులతో వేదపండితులు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details