తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తుల రాకతో కిటకిటలాడిన ఆలయాలు - కార్తీక పౌర్ణమి 2020

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఇల్లందులోని ఆలయాలకు భక్తులు కార్తిక పౌర్ణమి సందర్భంగా భారీగా తరలివచ్చారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని దీపారాధన చేశారు. భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడాయి.

Temples jammed with the arrival of devotees in bhadradri kothagudem district
భక్తుల రాకతో కిటకిటలాడిన ఆలయాలు

By

Published : Nov 30, 2020, 12:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

కార్తిక పౌర్ణమితో పాటు సోమవారం కావడంతో మహిళలు పెద్దఎత్తున దీపాలు వెలిగించారు. నీలకంఠేశ్వర స్వామికి భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

ఇల్లందులో కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. శివాలయంలో దీపాలు వెలిగించి పిల్లలు, పెద్దలు పూజల్లో పాల్గొన్నారు. ఆలయాలకు కరోనా కారణంగా తగ్గిన భక్తులు.. కార్తిక సోమవారం నేపథ్యంలో కిటకిటలాడాయి.

భక్తుల రాకతో కిటకిటలాడిన ఆలయాలు

ఇదీ చూడండి :కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

ABOUT THE AUTHOR

...view details