ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో రెండు రోజులపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. కాసేపట్లో విశాఖ చేరుకోనున్న గవర్నర్ తమిళిసై.. శంకరమఠంలోని కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం కృష్ణ ఐవీఎఫ్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.
TS Governor VSP Tour: రెండు రోజులపాటు విశాఖలో గవర్నర్ తమిళిసై పర్యటన - విశాఖలో గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై రెండు రోజులపాటు ఏపీలోని విశాఖలో పర్యటించనున్నారు. కాసేపట్లో విశాఖ చేరుకోనున్న తమిళిసై.. శంకరమఠంలోని కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విశాఖలో గవర్నర్ తమిళిసై పర్యటన
రేపు ఉదయం ఆంధ్ర వైద్య కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ రవిరాజును గవర్నర్ తమిళిసై సత్కరించనున్నారు. అనంతరం హిందుస్థాన్ షిప్ యార్డును సందర్శించనున్నారు. రేపు సాయంత్రం గవర్నర్ తమిళిసై తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
ఇదీ చదవండి:GHMC Ward Volunteer Committees : జీహెచ్ఎంసీలో వార్డు వాలంటీర్ కమిటీలు