రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధానాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. అర్చకులందించిన తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆలయంలోని లక్ష్మీ అమ్మవారి ఎదుట వేదపండితులు శ్రీనివాస్ గౌడ్‌కు ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించారు.
'పోలవరంతో భద్రాద్రి కోవెలకు ముంపు వాటిల్లితే ఊరుకోం'
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భద్రాద్రి సీతారామున్ని దర్శించుకున్న మంత్రి.. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
పోలవరంతో భద్రాద్రి కోవెలకు ముంపు వాటిల్లితే ఊరుకోం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. తెలంగాణలోని ఆలయాలన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి శ్రీనివాస్ అన్నారు. భద్రాద్రి ఆలయానికి పోలవరం నుంచి ఎలాంటి ముంపు వాటిల్లినా.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా కరోనా మహమ్మారిని జయించి.. ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి :స్మశానం సాక్షిగా.. ఓ సామాన్యురాలి కథ