ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేసిన మల్లన్న ఈ సారైనా తనను ఎమ్మెల్సీగా గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరారు.
పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలంటూ తీన్మార్ మల్లన్న ప్రచారం - ఇల్లందులో తీన్మార్ మల్లన్న ప్రచారం
పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించాలని తీన్నార్ మల్లన్న ఇల్లందులో ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేశానని చెప్పారు. ఈ సారైనా అవకాశం ఇచ్చి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు.

పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలంటూ తీన్మార్ మల్లన్న ప్రచారం
గతంలో ఎన్నికైన అభ్యర్థి.. నిరుద్యోగ, ఉద్యోగ, ఒప్పంద కార్మికుల సమస్యలపై ఏనాడు సభలో మాట్లాడిన దాఖలాలు లేవని మల్లన్న విమర్శించారు. చివరి వరకు ప్రజా సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై కేటీఆర్ సమీక్ష