సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశానికి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సాంకేతిక అభివృద్ధి పరంగా పాలనలో చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
అండగా ఉంటా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో తెదేపా కార్యాలయాన్ని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి రమణ ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.