సమస్యలు తీర్చాలంటూ సింగరేణి కార్మికుల ధర్నా - kothagudem
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మణుగూరులో ధర్నాకు దిగింది. ఎండలో కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు అన్నారు.
నిరసన తెలుపుతున్న నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ధర్నాకు దిగింది. వేసవి కాలంలో సింగరేణి కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని... పని మధ్యలో కార్మికులను మార్చాలని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు కోరారు. తమ విజ్ఞప్తి పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.