తెలంగాణ

telangana

ETV Bharat / state

రామయ్య కల్యాణానికి ఈ నెల9న తలంబ్రాల వేడుక

భద్రాద్రి రామయ్య కల్యాణానికి మూహూర్తం ఖరారైయింది. వచ్చే నెల రెండో తేదీన శ్రీ సీతారమచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ఈ నెల 9వ తేదీన తలంబ్రాలు కలుపనున్నారు. ఈ కార్యక్రమాని పాలక వర్గాలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

talambralu celebrations for rama kalyanam in bhadradri ramayya temple in bhadradri kothagudem
రామయ్య కల్యాణానికి ఈ నెల9న తలంబ్రాల వేడుక

By

Published : Mar 7, 2020, 11:55 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాలయం సందడిగా మారింది. వచ్చే నెల రెండో తేదీన జరుగనున్న లక్ష్మణ సమేత శ్రీ సీతారమచంద్ర స్వామి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. రామయ్య కల్యాణంలో ఎంతో పవిత్రమైన ఘట్టం తలంబ్రాలు పోయడం.. ఈ తలంబ్రాలను తయారు చేయడం కోసం ఆలయ పాలక వర్గాలు ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈ నెల 9వ తేదీన తలంబ్రాలను కలపడానికి చిత్రకూట మంటపాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. మంత్రోచ్ఛరణల నడుమ వైధిక పద్ధతిలో అతి పవిత్రంగా ఈ తలంబ్రాలను కలుపనున్నారు. 150 క్వింటాళ్ల ఎంపిక చేసిన నాణ్యమైన బియ్యాన్ని, నాలుగు కిలోల పసుపు, అంతే పరిమాణంలో కుంకుమను, మంచి ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఈ తంబ్రాలను కలుపనున్నారు. ఈ కార్యక్రమం అంతా కన్నులపండువగా జరుగనుంది. ఈ కార్యక్రమ మొత్తానికి ఈనెల 8వ తేదీన అంకురార్పణ పూజలు చేస్తారు.

రామయ్య కల్యాణానికి ఈ నెల9న తలంబ్రాల వేడుక

ఇవీ చూడండి:20 వరకు బడ్జెట్ సమావేశాలు.. 8న పద్దు

ABOUT THE AUTHOR

...view details