తెలంగాణ

telangana

ETV Bharat / state

అశ్వారావుపేటలో కరోనా నివారణ చర్యలు - అశ్వారావుపేటలో కరోనా కేసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు.

ashwarao peta covid cases
ashwarao peta covid cases

By

Published : Apr 28, 2021, 6:33 PM IST

కొవిడ్ విజృంభణ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంపీపీ శ్రీరామ్ మూర్తి.. గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వీధుల్లో.. పారిశుద్ధ్య పనులు చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.

ప్రజలందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాల్సిందిగా ఎంపీపీ సూచించారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని ఆయన కోరారు. మండలంలో ఇప్పటికే సుమారు 350 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఐదుగురు మహమ్మారి ధాటికి బలయ్యారు.

ఇదీ చదవండి:కరోనా హెల్ప్‌ డెస్క్‌ను సందర్శించిన బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details