తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి సీతారాములకు స్నపన తిరుమంజనం - భద్రాద్రి సీతారాములకు స్నపన తిరుమంజనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో సర్వఏకాదశిని పురస్కరించుకుని స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామివారికి వివిధ తీర్థాలతో అభిషేకం చేస్తూ... ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

swnapana thirumanjanam to sitarama
భద్రాద్రి సీతారాములకు స్నపన తిరుమంజనం

By

Published : Feb 19, 2020, 11:24 AM IST

సర్వఏకాదశి పురస్కరించుకుని భద్రాద్రి సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను మండపం వద్దకు తీసుకొచ్చి పాలు, తేనె, నెయ్యి, నదీజలాలు, పంచోదకములతో అభిషేకం నిర్వహించారు.

వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామివారికి వివిధ తీర్థాలతో అభిషేకం చేస్తూ... ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం ప్రధాన ఆలయంలోని స్వామివారికి ఏకాంతంగా లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.

భద్రాద్రి సీతారాములకు స్నపన తిరుమంజనం

ABOUT THE AUTHOR

...view details