భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలో అకాల వర్షానికి బొప్పాయి తోటలు నేలరాలాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి తనకున్న పదెకరాల పొలంలో బొప్పాయి తోట సాగు చేశాడు. మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం, గాలి దుమారం పంట మొత్తాన్ని నేలపాలు చేశాయి.
అకాల వర్షం... నేల రాలిన బొప్పాయి పంట - లక్ష్మీపురం గ్రామం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అకాల వర్షానికి జిల్లాలోని బొప్పాయి పంటలు నేలపాలయ్యాయి. దిగుబడి బాగుందని సంబరపడుతున్న తరుణంలో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి.
నేల రాలిన బొప్పాయి పంట
ఫలితంగా పంట మట్టి పాలవడం వల్ల రైతు కుటుంబాలు లబోదిబోమంటున్నారు. అకాల వర్షానికి భారీ నష్టమే చవి చూశామని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి : ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన వద్దు: రాజీవ్ గౌబా