తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల స్థలాన్ని రక్షించాలి: విద్యార్థి సంఘాలు

పాఠశాల స్థలాన్ని రక్షించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. పాఠశాల స్థలంలో చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని అధికారులకు వినతి పత్రం అందించాయి.

By

Published : Jun 10, 2021, 1:34 PM IST

పాఠశాల స్థలాన్ని రక్షించాలి: విద్యార్థి సంఘాలు
పాఠశాల స్థలాన్ని రక్షించాలి: విద్యార్థి సంఘాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మెయిన్ రోడ్డులోని పాఠశాల స్థలంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలను ఆపాలని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నాయకులు, పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ స్థలంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ షాపుల కోసమంటూ నిర్మాణాలు చేపట్టారు.

ప్రభుత్వ పాఠశాల స్థలంలో కాకుండా మరో ప్రాంతంలో నిర్మించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సీఐ బరపటి రమేశ్​, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావుకు వినతిపత్రం ఇచ్చారు.
పలు విద్యా సంస్థలకు అధినేతగా ఉన్న ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాపార సముదాయాల నిర్మాణం చేపట్టాలని చూడడం సముచితం కాదన్నారు.

ఇదీ చదవండి:Covid-19: దేశంలో రికార్డ్​ స్థాయిలో కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details