భద్రాచలంలో ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇవాళ పరిశీలించారు. రేపు ప్రధాన ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకల్లో పాల్గొనేందుకు రేపు భద్రాచలం రానున్నారు.
ఎల్లుండే రామయ్య కల్యాణం.. ముస్తాబైన భద్రాచలం - భద్రాచలంలో రామయ్య ఆలయాన్ని దర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్
భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చరిత్రలో తొలిసారి భక్తజనం సందోహం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నా... సంప్రదాయంగా జరిగే అన్ని క్రతువులు వైభవంగా జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
![ఎల్లుండే రామయ్య కల్యాణం.. ముస్తాబైన భద్రాచలం bhadrachalam temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6611815-thumbnail-3x2-bcm-rk.jpg)
ఎల్లుండే రామయ్య కల్యాణం.. ముస్తాబైన భద్రాచలం
ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా 30 మంది లోపే అర్చకులు వైదిక పెద్దలు, వీఐపీలతో కల్యాణ క్రతువు జరపనున్నారు. భక్తులంతా ప్రసార మాధ్యమాల ద్వారా సీతారాముల కల్యాణం చూసి తరించాలని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు.
ఎల్లుండే రామయ్య కల్యాణం.. ముస్తాబైన భద్రాచలం