Srirama Navami in Badrachalam: ఈ సంవత్సరం భద్రాచలంలో ఉగాది పండగ రోజు రాములు వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగానే 30న శ్రీ రామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. ముందు రోజు 29న స్వామి వారి కల్యాణం ఎదుర్కోలు ఉత్సవం పూజారులు చేయనున్నారు. 31న స్వామి వారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఆలయ అర్చకులు జరిపించనున్నారు. భద్రాచలంలో జరిగబోయే కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర ప్రముఖులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం శ్రీ రాముల వారి కల్యాణం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహిస్తోన్నారు.
ఆదివారం తెలుగు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు సీతారామ కల్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలను సమర్పించుకున్నారు. మరి కొంత మంది భక్తులు ముత్యాలతో చేసిన వస్త్రాలను బహుకరించారు. తలంబ్రాల్లో సగం భద్రాచలంలో ఉంచి మరికొన్ని ఒంటిమిట్ట రామాలయానికి తీసుకెళ్లనున్నారు. శ్రీ రామ నవమి క్రతువుల్లో పాల్గొనేందుకు చిన్న జీయర్ స్వామి రానున్నారు.
శ్రీ రామ నవమి విశిష్టత:విష్ణువు దశావతారాల్లో ఒక అవతారం శ్రీరాముని అవతారం. రావణాశురుడు అనే రాక్షసుడిని వధించడానికి ఈ అవతారం ఎత్తారు. అయోధ్యకు రాజైన దశరథునికి ముగ్గురు భార్యలు. తనకి పుత్ర సంతానం లేదని బాధపడుతూ ఉండేవాడు. శోకంలో ఉన్న తనకి వశిష్ఠ మహాముని పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చారు. దీంతో దశరథుడు ఆ యాగాన్ని చేశారు. దీని ఫలితంగా ముగ్గురు భార్యలకు పుత్రులు జన్మించారు. అందులో కౌసల్యకి శ్రీ రాయుడు జన్మించాడు. విష్ణువు ఈ అవతారంలో జన్మించిన తేదిని ప్రతి సంవత్సరం ఈ వేడుకను చేసుకుంటారు. ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ రాముల వారిని పూజిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ ఉత్సవాలను జరుపుకొంటారు.
శ్రీరామ నవమికి ఏర్పాట్లు:రాష్ట్రంలో ప్రతి ఊరులోనూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో భద్రాచలంలో మరింత కనుల విందుగా ఈ పండగను చేస్తారు. అందువల్ల ఆ రోజున దేవాలయానికి అధిక మొత్తంలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం శ్రీ రాముని కల్యాణం చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారని .. దీనికి సంబంధించిన టికెట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు. పండగలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేలా పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: