భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 21న శ్రీరామనవమి, ఏప్రిల్ 22న పట్టాభిషేకం ఉత్సవాలకు ఈ నెల 5 నుంచి సెక్టారు టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు
భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు
ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైనా శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాలకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి www.bhadrachalamonline.com ద్వారా రూ.5000 ,రూ.2000, రూ.1116, రూ.500,రూ.200,రూ.100 టికెట్లు బుక్ చేసుకోవచ్చని అన్నారు.
ఇదీ చదవండి: పెద్దగట్టు జాతరలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి