Sriramanavami in Darga: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని సత్యనారాయణపురంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇంతకీ ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వేడుక జరిగింది హజరత్ నాగుల్ మీరా దర్గాలో. సీతారాముల కళ్యాణ మహోత్సవం కులమతాలకు అతీతంగా జరిగింది. దర్గాలో జరిగిన ఈ వేడుకకు స్థానిక నేతలు, భక్తులు, ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు.
కులమతాలకు అతీతంగా ఉండే ఈ దర్గాకు రాజకీయ నాయకులు, భక్తులు వస్తుంటారు. గత సంవత్సరం నుంచి సంప్రదాయ రీతిలో వేద మంత్రాలు మంగళవాయిద్యాల నడుమ శ్రీరామనవమి వేడుకలు జరుపుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే రీతిన ఏర్పాట్లు చేశారు. ఇవాళ కళ్యాణం జరిపిన నిర్వాహకులు.. రేపు పట్టాభిషేకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞ వేషధారణలతో రామాయణం విశిష్టత తెలియజేస్తూ కళ్యాణ తీరును నిర్వహించారు.