తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2023, 5:26 PM IST

Updated : Mar 19, 2023, 5:37 PM IST

ETV Bharat / state

శ్రీరామ పుష్కర పట్టాభిషేకానికి నదీ జలాల సేకరణ పూర్తి.. భద్రాద్రిలో ఘనంగా శోభాయాత్ర

Sri Rama Navami celebrations: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి అవసరమైన నదీ జలాలను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భద్రాచలం అర్చక వైదిక కమిటీ సేకరించింది.

పుష్కర పట్టాభిషేకం
పుష్కర పట్టాభిషేకం

Sri Rama Navami celebrations: రాబోయే శ్రీరామ పుష్కర పట్టాభిషేకానికి తొమ్మిది మంది అర్చక వైదిక సిబ్బంది 12 రోజులపాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాల తీర్ధాన్నిసేకరించి భద్రాద్రికి చేరుకున్న అనంతరం శోభాయాత్ర నిర్వహించారు.

శోభాయాత్ర

బ్రిడ్జి సెంటర్​లోని అభయ ఆంజనేయస్వామి ఆలయంలో నదిజలాలకు ప్రత్యేక పూజలు చేసి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నదీజలాలను భద్రాద్రి ఆలయంలో భద్రపరిచారు. ఈ నెల 31న రామాయణ పారాయణం జరిపిన అనంతరం పుష్యమి నక్షత్రంలో శ్రీరాముడికి పుష్కర పట్టాభిషేకం జరుగనుంది.

శోభాయాత్ర

srirama pushkara pattabishekam: 60 సంవత్సరాలకు ఒకసారి సేకరించిన నదీ జలాలతో భద్రాచలంలో శ్రీరాముడికి పుష్కర పట్టాభిషేకం జరుగుతుంది. ప్రభవ నామ సంవత్సరం 1987లో ఈ పట్టాభిషేకం జరిగింది. అన్ని నదులు, సముద్రాలు, పుష్కరిణీ తీర్థాలు, రామాయణ పారాయణం, హవనం జరిగి అత్యంత వైభవోపేతంగా ఈ వేడుకను నిర్వహించారు.

శోభాయాత్ర

ఆనాడు జన సందోహంతో భద్రాచల దివ్య క్షేత్రం నిండి పోయింది. అయితే 60 సంవత్సరాలకు ఒక్కసారి అలా జరిగితే జీవితకాలంలో దర్శించే భాగ్యం అందరికీ లేకపోవచ్చు అనే భావనతో పెద్దలు 12 (పుష్కరం) సంవత్సరాలకు ఒక్కమారు (60సంవత్సరాలకు ) జరిగినట్టుగా చేయాలి అని సంకల్పించి 2011లో మొదటిసారి పుష్కర పట్టాభిషేకానికి నాంది పలికారు. అలా మళ్లీ 12 సంవత్సరాల తర్వాత ఈ 2023లో పుష్కర పట్టాభిషేకం వచ్చింది. దానికోసమే అర్చక స్వాములు నాలుగు దిక్కులకు వెళ్లి నదులు, సముద్రాలు, పుష్కరిణీ తీర్థాలు తీసుకొచ్చారు.

శోభాయాత్ర

తలంబ్రాల ప్యాకింగ్​ మిషన్​ విరాళం...

భద్రాద్రి రామయ్య సన్నిధికి ఒక లక్ష 70 వేల రూపాయల విలువ గల తలంబ్రాల ప్యాకింగ్ మిషన్​ను తిరుపతికి చెందిన సేవా కుటుంబం మహిళలు కానుకగా అందించారు. ఈ యంత్రం ద్వారా సులభంగా రోజుకు 30 వేల ప్యాకెట్లను ప్యాకింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందని సేవా కుటుంబం మహిళ భక్తులు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు సమర్పిస్తున్న మహిళలు ఈ ఏడాది 2 క్వింటాళ్ల వడ్లను 5 రాష్ట్రాలలోని 4 వేల మంది ఆర్య వైశ్య మహిళలచే వలిపించి ఈరోజు భద్రాద్రి సన్నిధికి అందించారు. ఈనెల 30న జరగనున్న సీతారాముల కళ్యాణం మహోత్సవంలో ఈ కళ్యాణ తలంబ్రాలను వాడనున్నారు.


ఇవీ చదవండి:

Last Updated : Mar 19, 2023, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details