తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు తేదీలు ఖరారు.. ఈసారి భక్తుల మధ్యే రాములోరి కల్యాణం - sri rama navami in bhadradri 2022

Sri Rama Navami in Bhadradri: భక్తులంతా ఏడాదికొకసారి ఎంతో భక్తిభావంతో ఎదురుచూసే సీతారాముల కల్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు ముహూర్తం, తేదీలు ఖరారయ్యాయి. భద్రాద్రి వేదికగా జరిగే ఈ వేడుకల్లో సీతాసమేత రామయ్య కల్యాణాన్ని వీక్షించి యావత్​ భక్తజనం పులకరింతకు లోనవుతుంది. మనసంతా పరవశంతో నిండి.. వారిలాగే ఆదర్శ దంపతుల్లా జీవించే వరాన్ని ప్రసాదించమంటూ నూతన దంపతులు కోరుకుంటారు. కానీ కొవిడ్​ కారణంగా గత రెండేళ్లుగా రాములోరి కల్యాణం అంతరంగికంగా జరగడంతో భక్తులు కొంచెం నిరాశకు గుర్యయారు. ఈ ఏడాది మాత్రం భక్తులకు శుభవార్త అందించింది ఆలయ అధికారులు.

sri rama navami celebrations  in bhadradri
భద్రాద్రిలో సీతారాముల కల్యాణం

By

Published : Feb 22, 2022, 1:35 PM IST

Sri Rama Navami in Bhadradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి 16 వరకు పదిహేను రోజుల పాటు.. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 10 న, మహా పట్టాభిషేకం వేడుకను 11వ తేదీన నిర్వహించనున్నారు.

అంగరంగ వైభవంగా కల్యాణం

కొవిడ్​ కారణంగా గత రెండేళ్లుగా అంతరంగికంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఈ ఏడాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈవో శివాజీ తెలిపారు. ఎప్పటిలాగే తిరువీధి సేవలు, స్వామివారి ఊరేగింపులు ఉంటాయని చెప్పారు. ముందుగానే ఆన్​లైన్​లో టికెట్లు విక్రయిస్తామని, భక్తులంతా విశేష సంఖ్యలో హాజరై సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:శ్రీవారి భక్తులకు 'సర్వదర్శన' కష్టాలు.. టోకెన్లు అందినా 4 రోజుల తర్వాతే దర్శనం

ABOUT THE AUTHOR

...view details