భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. భోగి పర్వదినం సదర్భంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిపారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసి జిలకల బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు.
ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం - sri godha ranganadha swamy kalyanam in bhadrachalam
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. మకర సంక్రాంతి సందర్భంగా రేపు రామయ్యకు రథోత్సవం నిర్వహించనున్నారు.
![ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5708503-thumbnail-3x2-ramayya.jpg)
ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం
స్వామి వారి కల్యాణ వేడుక తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణంలో పాల్గొన్న ఉభయ దాతలకు శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. మకర సంక్రాంతి సందర్భంగా బుధవారం నాడు రామయ్యకు రథోత్సవం నిర్వహించనున్నారు.
ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం
ఇదీ చూడండి: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవంలో తెరాస హవా