భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో... నిత్య కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని నిత్యకల్యాణ మూర్తులను... మేళతాళాల నడుమ ప్రాకార మండపం వద్దకు తీసుకువచ్చారు.
Bhadradri Temple : భద్రాద్రి ఆలయంలో నిత్యకల్యాణ వేడుక - bhadradri lord rama temple news
భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో.. స్వామి వారి నిత్యకల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ అర్చకులు పూజలు నిర్వహించారు.
భద్రాద్రి ఆలయంలో నిత్యకల్యాణ వేడుక
కల్యాణ వస్త్రాల్లో ఉన్న సీతారాములను బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకల్ని వైభవంగా జరిపారు. భక్తులు శ్రీరామ స్మరణలో తన్మయత్వం చెందారు.