రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక యాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రామయ్య తండ్రిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. బంగారు కవచాలతో సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు.
కాళేశ్వరం ప్రారంభాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో పూజలు - badradri rama temple
తెలంగాణ జలప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొలాల్లో గోదారమ్మ చేరి పంటలు సమృద్ధిగా పండాలని అర్చకులు రామయ్యను వేడుకున్నారు.
కాళేశ్వరం ప్రారంభాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో పూజలు
TAGGED:
badradri rama temple