భద్రాద్రిలో ఈనెల 21న జరగనున్న సీతారాముల కల్యాణానికి నేడు అంకురార్పణ నిర్వహించనున్నారు. అంకురార్పణ ఉత్సవంలో భాగంగా ఈరోజు గోదావరి నది వద్ద నుంచి తీర్థ బిందెను అర్చకులు తీసుకొచ్చారు. తీర్థబిందెతో ఆలయ ప్రదక్షిణ చేశారు.
భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి నేడు అంకురార్పణ - sitharama kalyanam
భద్రాద్రిలో ఈ నెల 21న జరిగే రామయ్య కల్యాణోత్సవానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం అర్చకులు అంకురార్పణ పూజలు చేయనున్నారు.
భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి నేడు అంకురార్పణ
అనంతరం సీతారాముల కల్యాణానికి ఆలయ అర్చకులకు ఆలయ ఉద్యోగులకు దీక్షా వస్త్రాలు అందించనున్నారు. లక్ష్మణ సమేత సీతారాముల స్వర్ణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం యాగశాలలో వాస్తు హోమం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.