తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆటోల్లో సౌండ్ బాక్సులు పెడితే కఠిన చర్యలు' - ఆటోల డ్రైవర్లకు పోలీసుల వార్నింగ్

ఆటో డ్రైవర్లు విపరీతమైన శబ్దం వచ్చే సౌండ్ బాక్సులు పెడితే కఠిన చర్యలు తప్పవని భద్రాచలం ట్రాఫిక్​ ఎస్సై సురేశ్​ హెచ్చరించారు. పట్టణంలోని అంబేడ్కర్​ సెంటర్​ వద్ద ఉన్న ఆటోల సౌండ్​ బాక్సులు సీజ్ చేశారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం చలానాలు విధించారు.

Sound system boxes seized in autos  by traffic police in bhadrachalam in bhadradri kothagudem district
'ఆటోల్లో సౌండ్ బాక్సులు పెడితే కఠిన చర్యలు'

By

Published : Feb 27, 2021, 5:56 PM IST

మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆటో డ్రైవర్లు నడుచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ట్రాఫిక్​ ఎస్సై సురేశ్ అన్నారు. అధిక శబ్దాలతో ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు చలానాలు విధించారు. వారి నుంచి సౌండ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. మరోసారి ఆటోల్లో సౌండ్ బాక్సులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా ఎవరైనా ఉంటే బాక్సులు తొలగించుకోవాలని సూచించారు. వాహనదారులు, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్​ ఎస్సై సురేశ్​ తెలిపారు.

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్​ ఎస్సై సురేశ్​

ఇదీ చూడండి :ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తెరాసదే : తలసాని

ABOUT THE AUTHOR

...view details