భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ గ్రామానికి చెందిన రొడ్డ వెంకటేశ్వర్లు పుట్టుకతోనే దివ్యాంగుడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018 ఏప్రిల్ 27న కూలీ పనుల కోసం వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు అన్ని చోట్ల వెతికిన జాడ దొరకలేదు. ఎన్ని రోజులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆనాటి నుంచి పోలీసులు పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ... వెంకటేశ్వర్ల ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పట్టి నగర్ గ్రామానికి చెందిన నాగేంద్ర ప్రసాద్.. టిక్‌టాక్ చూస్తుండగా.. తప్పిపోయిన వెంకటేశ్వర్లు అందులో కనిపించాడు. పంజాబ్ లూథియానాలో ఎవరో వెంకటేశ్వర్లకు భోజనం పెడుతూ.. టిక్ టాక్ తీశారు. అది చూసిన నాగేంద్ర ప్రసాద్.. వారి కుటుంబ సభ్యులకు టిక్‌టాక్... చూపించాడు.