భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన నవీన్(38) కొవిడ్ బారిన పడి మరణించాడు. మృతుడి కుమారుడు.. పీపీఈ కిట్ ధరించి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు. కడసారి తండ్రి స్పర్శ కరువైన చిన్నారి పరిస్థితి.. స్థానికులను కలచివేసింది. ఈ కార్యక్రమం.. పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగింది.
పీపీఈ కిట్‌తో తండ్రికి అంత్యక్రియలు - funeral for covid deadbody
కొవిడ్ బారిన పడ్డ తండ్రి.. కోలుకొని ఇంటికి వస్తాడని ఎదురు చూసిన ఓ బాలుడి ఆశలు అడియాశలు అయ్యాయి. అప్పటివరకు పీపీఈ కిట్లను టీవీల్లో మాత్రమే చూసిన ఆ చిన్నారి.. అది ధరించి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది.
funeral for covid dead body