గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. మొన్నటివరకు నీరు లేక ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన జీవనది నేడు జలకళను సంతరించుకుంది. శనివారం 4 అడుగులకు పరిమితమైన నీటి మట్టం.. ఆదివారం ఉదయానికి 9 అడుగులకు చేరుకుంది.
గోదావరిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం - జలకళ సంతరించుకున్న గోదావరి
నీరు లేకుండా కళావిహీనంగా మారిన గోదావరి నేడు జలకళను సంతరించుకుంది. ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన జీవనది నేడు పెరిగిన నీటి మట్టంతో చూపరులను ఆకట్టుకుంటోంది.
![గోదావరిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం Godavari with water bodies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12202137-745-12202137-1624189410744.jpg)
జలకళ సంతరించుకున్న గోదావరి
జలకళ సంతరించుకున్న గోదావరి
ఎగువ ప్రాంతాల్లో ఉన్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం వల్లే గోదావరిలో నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు ఎక్కువగానే ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.