బీసీ గురుకులంలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత - బీసీ గురుకులంలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బీసీ బాలుర గురుకులంలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

sixteen students got ill due to drink expired milk in badrachalam bc hostel
కాలం చెల్లిన పాలతో సేమ్యా చేసి విద్యార్థులకు పెట్టడం వల్ల అది తిన్న చిన్నారులు వాంతులు విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. మొత్తం 16 మంది బాలురు అస్వస్థతకు గురయ్యారు. వీరందిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అనారోగ్యం పాలైన బీసీ గురుకుల విద్యార్థులను జిల్లా ఆర్సీఓ బ్రహ్మచారి పరామర్శించారు.
బీసీ గురుకులంలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత
- ఇదీ చూడండి : ఫ్లెక్సీలు, బ్యానర్లు లేకుండా పూజలు చేయలేరా?
TAGGED:
ill