భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల స్థలంలో ట్రీ గార్డుల ఏర్పాటును పురపాలక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సింగరేణి సహకారం..10 ఎకరాల చిట్టడివి ఏర్పాటు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు
ఇల్లందులో సింగరేణి సహకారంతో చిట్టడివి ఏర్పాటు ప్రదేశాలను పురపాలక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. 10 ఎకరాల స్థలంలో ట్రీ గార్డుల ఏర్పాటును గమనించారు.
సింగరేణి సహకారం..10 ఎకరాల చిట్టడివి ఏర్పాటు
సింగరేణి సంస్థ సహకారంతో తీసుకున్న స్థలాన్ని చదును చేయించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చిట్టడివి, ట్రీ గార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు పురపాలక చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చూడండి :ప్లాస్మా కొరత.. దానం చేయాలంటూ విస్తృత ప్రచారం