భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సంస్థ అధికారులకు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల యాజమాన్యం వివక్ష చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అత్యవసర విధులు నిర్వహిస్తున్న విధులు నిర్వహిస్తున్న కార్మికులు మృతిచెందితే కేంద్రం ప్రభుత్వం 15లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 లక్షల ఇన్స్యూరెన్స్ ప్రకటిస్తూ జీవో విడుదల చేశాయని పేర్కొన్నారు. అయితే దీనిని తమకు వర్తించచేయకపోవడంపై ఆందోళనకు దిగారు.
'కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోంది' - 'కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోంది'
కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోందని ఇల్లందు జీఎం కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా నిర్వహించారు. తమకు కూడా 15లక్షల ఎక్స్గ్రేషియా, 50లక్షల ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.
'కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోంది'
అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా 15లక్షల ఎక్స్గ్రేషియా, 50లక్షల ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాయం వెంకన్న, ఎండీ యాకుబ్ పాషా, కే.దుర్గారావు, డి.వీరస్వామి, జి.సతీష్, మధు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రేపటినుంచి ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించనున్న సీఎల్పీ