తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి ఉండాలి.. జీఎంలకు సింగరేణి సీఎండీ ఆదేశం

Singareni CMD Review: గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సవం మొదటి తొమ్మిది నెలల్లో సింగరేణి సంస్థ మంచి వృద్ధిని నమోదుచేసిందని సీఎండీ శ్రీధర్​ తెలిపారు. ఇదే ఒరవడితో 68 మిలియన్‌ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలని జీఎంలకు సూచించారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్​లో సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ శ్రీధర్ నెలవారీ బొగ్గు ఉత్పత్తి సమీక్ష నిర్వహించారు.

Singareni CMD Review
Singareni CMD Review

By

Published : Jan 3, 2022, 8:25 PM IST

Singareni CMD Review: సింగరేణి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన బొగ్గు ఉత్పత్తితో పోల్చితే.. 2020-21 ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం, బొగ్గు రవాణాలో 52 శాతం, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపులో 23 శాతం వృద్ధిని నమోదుచేసిందని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. మిగిలిన మూడు నెలల కాలంలో ప్రతి ఏరియా.. తనకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని ఆదేశించారు. ఏరియాల వారీగా సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. ఇకపై రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 14.8 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు జరపాలని స్పష్టం చేశారు.

ఏప్రిల్‌ నుంచి ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి కానుందని, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త గనుల నుంచి ఉత్పత్తి సాధించడంపైనా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా భూసేకరణ, ఆర్​ అండ్​ ఆర్​ (R&R- Resettlement and Rehabilitation) సమస్యలను ఆ ప్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటూ పరిష్కరించుకోవాలని జీఎంలకు ఆదేశించారు.

కంటిన్యూయస్‌ మైనర్‌ పనితీరుపై..

సోమవారం మధ్యాహ్నం అడ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టు, కంటిన్యూయస్‌ మైనర్‌ యంత్రాల పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అడ్రియాల లాంగ్‌ వాల్‌ నుంచి గత రెండు నెలలగా మెరుగైన ఉత్పత్తి సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెలలో 2 లక్షల టన్నుల ఉత్పత్తి, తర్వాత నెల నుంచి 2.5 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని అధికారులకు సూచించారు. ఈ గనిలో ఇంకా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని, తగినంత మానవ వనరులను సంసిద్ధపరచుకోవాలని ఆదేశించారు. నాలుగో ప్యానెల్​కు సంబంధించిన సన్నాహాలను మరింత వేగవంతం చేయాలన్నారు. అలాగే వివిధ గనుల్లో ఉన్న కంటిన్యూయస్‌ మైనర్​ యంత్రాల పనితీరునూ సమీక్షించారు. జీడీకే 11ఏ గనిలో ఉన్న రెండు కంటిన్యూయస్‌ మైనర్​ యంత్రాలు ఒక్కొక్కటి 25 నుంచి 30 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాలని, అలాగే పీవీకే-5, వకీల్​పల్లిలోని కంటిన్యూయస్‌ మైనర్​ యంత్రాలు ఇదే స్థాయిలో ఉత్పత్తులు సాధించాలని ఆదేశించారు.

ఇదీచూడండి:Race Energy Swap Station: ఎలక్ట్రిక్‌ వాహనాదారులకు శుభవార్త.. కేవలం రెండు నిమిషాల్లో బ్యాటరీ స్వాపింగ్‌

ABOUT THE AUTHOR

...view details