సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ బ్యాంకాక్‌లో భారతీయ మహంతం అవార్డును స్వీకరించారు. ప్రముఖ ఏషియావన్ పత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన 13వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ సదస్సులో అవార్డును అందుకున్నారు. మొరాకో దేశ రాయబారి అబ్దెలిల్లాపా హోస్ని, మాల్దీవ్స్ రాయబారి మహ్మద్ జిన్నా నుంచి అంతర్జాతీయ స్థాయి అవార్డును తీసుకున్నారు. ఆసియా దేశాల్లో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఇచ్చే భారతీయ మహంతం పురస్కరం 2019-20 ద లీడర్ పేరుతో ఎన్. శ్రీధర్‌కు నిర్వాహకులు బహుకరించారు.
సింగరేణి అభివృద్ధి దృష్ట్యా...
ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, వాణిజ్య పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో ఈ అవార్డును శ్రీధర్ స్వీకరించారు. సింగరేణిని గత ఐదేళ్ల కాలంలో దేశంలో అత్యంత వృద్ధిరేటు సాధించిన కంపెనీగా నిలిపినందుకు అవార్డును ఏషియావన్(థాయ్‌లాండ్ మ్యాగజైన్) ప్రకటించింది. సింగరేణి గత ఐదేళ్లలో అమ్మకాలలో 78శాతం, లాభాలలో 262 శాతం, బొగ్గు రవాణాలో 28శాతం, బొగ్గు ఉత్పత్తిలో 23శాతం సాధించిన నేపథ్యంలో సీఎండీని ప్రతిభావంతనాయకునిగా అవార్డుకు ఎంపిక చేశారు.