సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు (Thermal power plants) అవసరం మేరకు బొగ్గు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి డైరెక్టర్లు (SINGARENI DIRECTORS) ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో (Telangana Thermal power plants) కనీసం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నందున రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేదని వెల్లడించారు. దేశంలో బొగ్గు కొరత వార్తల నేపథ్యంలో సంస్థ సీఎండీ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో (singareni bawan)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.ఆల్విన్, జీఎం కె.సూర్యనారాయణ, జీఎం కె.రవిశంకర్‌తో కలిసి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి, రవాణాపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు (SINGARENI DIRECTORS REVIEW).
ఉత్పత్తి పెంచాలి..
ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశా నిర్దేశం చేశారు (coal production). దేశంలో పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందన్న వార్తలు వస్తున్నాయని... తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. అక్టోబరులో రోజూ 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, కనీసం 34 రేకులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డైరెక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు మార్గ నిర్దేశం చేశారు.
అవసరాలమేరకు సప్లై చేసేలా..
కొత్తగూడెం ఏరియా నుంచి ప్రతిరోజూ 7 రేకులు, ఇల్లందు నుంచి 5 రేకులు, మణుగూరు 5, ఆర్జీ-1 నుంచి 1 రేకు, ఆర్జీ-2 ఏరియా నుంచి 7, బెల్లంపల్లి నుంచి 1, మందమర్రి నుంచి 3, శ్రీరాంపూర్ నుంచి 5 రేకుల చొప్పున బొగ్గు రవాణా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఏరియా జీఎంలను ఆదేశించారు. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్.ఎస్.ఎ) చేసుకున్న థర్మల్ స్టేషన్లయిన టీఎస్జెన్కో (తెలంగాణ)(TS GENCO), ముద్దనూరు ఏపీ జెన్కో(AP GENCO), పర్లీ మహా జెన్కో (మహారాష్ట్ర), రాయచూర్ కెపిసీఎల్ (కర్ణాటక), మెట్టూర్టాన్ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీకి(NTPC), ఎస్టీపీపీ (సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం)తో పాటు బ్రిడ్జ్ లింకేజీ కలిగిఉన్న విద్యుత్ కేంద్రాలైన ఆంధ్రప్రదేశ్‌లోని వి.టి.పి.ఎస్., మహారాష్ట్ర లోని కొరడి, షోలాపూర్ ఎన్.టి.పి.సి., కర్ణాటకలోని ఎరమరాస్ మొదలగు విద్యుత్ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
లక్ష్య సాధన దిశగా..
సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గులో 1.5 లక్షల టన్నులను (86 శాతం) థర్మల్ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగంలో వర్షాలు ఉన్నప్పటికీ థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా మాత్రం యథావిధిగా కొనసాగించినట్లు వివరించారు. పవర్ సెక్టార్‌కి 273.54 లక్షల టన్నులు పంపాల్సి ఉండగా 271.46 లక్షల టన్నులు రవాణా చేయడం ద్వారా 99.24 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది సంస్థ నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు అన్ని ఏరియాలలో ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ లక్ష్య సాధనకు కృషి చేసేలా చూడాలని ఏరియా జి.ఎం.లకు సూచించారు.
ఇదీ చూడండి:Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్