భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ పరిధిలోని నెహ్రూనగర్‌లో కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులను కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ డీఈ మురళి, ఏఈ రాజేష్, జవాన్ వెంకటేశ్వర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ - పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్ ఎంవీ రెడ్డి
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మున్సిపల్ పరిధి నెహ్రూనగర్‌లో కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
పారిశుద్ధ్య పనుల నిర్వహణ పది రోజుల్లోగా మెరుగుపడాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. నెహ్రూ నగర్ ప్రాంత ప్రజల సమస్యలను విన్న ఆయన నిర్వహణ లోపాన్ని గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చూడండి :సూది బెజ్జంలో ట్రంప్.. అభిమాని కళారూపం