40మంది జవాన్ల మృతిపై దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. భద్రాద్రి రామాలయంలోనూ ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని ఒకరోజు వేతనం అందించారు.
ఒకరోజు వేతనం విరాళం
By
Published : Feb 16, 2019, 12:19 PM IST
ఒకరోజు వేతనం విరాళం
కశ్మీర్లో వీర మరణం చెందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాముల వద్ద అర్చకులు వేద పఠనం చేశారు. ఈ పూజలకు హాజరైన ఈఓ రమేష్ బాబు, ఆలయ సిబ్బంది... ఒకరోజు వేతనాన్ని జవాన్ల కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. అనంతరం చిత్రకూట మండపం వద్ద ఆలయంలో పని చేస్తున్న పోలీసులు వీర జవాన్లకు నివాళులు అర్పించారు.