తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణం తీసిన లైంగిక వేధింపులు - పాల్వంచలో మహిళపై లైంగిక వేధింపులు

వారు కూలీ దంపతులు. ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో హాయిగా జీవిస్తున్నారు. ఓ ప్రబుద్ధుడు ఆ వివాహితపై కన్నేశాడు. లైంగికంగా వేధించి, కాపురాన్ని కూల్చేస్తానంటూ బెదిరించి చివరకు ఆమె చావుకు కారణమయ్యాడు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడికే.. అతని తల్లిదండ్రులు వంతపాడటం కొసమెరుపు.

sexually abused a married woman in Bhadradri Kothiagudem District
ప్రాణం తీసిన లైంగిక వేధింపులు

By

Published : May 24, 2020, 9:37 AM IST

ఓ వివాహిత (43) భర్త, ఇద్దరు పిల్లలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఓ తండాలో నివసిస్తోంది. వీరిది వ్యవసాయ కూలీ కుటుంబం. అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు(21) వివాహితపై కన్నేశాడు. ఏడాది క్రితం ఆమె స్నానం చేస్తుండగా ఫోన్‌లో చిత్రీకరించాడు. వాటిని చూపి ఆమెను లోబరుచుకునేందుకు యత్నించాడు. ఆమె ఫిర్యాదు చేయడం వల్ల పెద్దమనుషులు పంచాయితీ పెట్టి అతణ్ని మందలించి వదిలేశారు.

మళ్లీమళ్లీ అదే వరస

కొన్నాళ్లు ఆమె జోలికి రాని అతను, నెల రోజులుగా భర్త లేని సమయాల్లో ఇంట్లోకి వెళ్లి బెదిరించడం మొదలుపెట్టాడు. ‘శారీరక సంబంధానికి అంగీకరించకపోతే నీ భర్తను చంపేస్తానని’ బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను చిత్రీకరించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తూ ఆమెపై లైంగిక దాడిని కొనసాగిస్తూ వస్తున్నాడు.

వేధింపులు తాళలేని ఆమె శుక్రవారం జరిగిన విషయాన్ని భర్తకు చెప్పగా, ఆయన పాల్వంచ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న మధు, అతని తల్లిదండ్రులు బాధితురాలి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. దీనితో మనస్తాపానికి గురైన ఆమె పురుగు మందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుడు, అతని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నామని ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

ఇదీ చూడండి:సోమవారం రంజాన్​ వేడుకలు.. నెలవంక వల్లే!

ABOUT THE AUTHOR

...view details