తెలంగాణ

telangana

ETV Bharat / state

రామాలయం ఈవో పోస్టు కోసం పైరవీలు? - రామాలయం ఈవో

గత కొద్దికాలంగా ఖాళీగా ఉన్న భద్రాచలం రామాలయం ఈవో పోస్టు కోసం కొంతమంది సీనియర్​ అధికారులు పోటీ పడుతున్నారు. ఆలయ బాధ్యతలు దక్కించుకోవడానికి శక్తి మేరకు పైరవీలు చేస్తున్నారు. కాగా.. దేవాదాయ శాఖ స్పెషల్​ గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ప్రస్తుత భద్రాచల ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.

Senior Officers Trying to get Bhadrachalam Ramalayam Eo Post
రామాలయం ఈవో పోస్టు కోసం పైరవీలు?

By

Published : Aug 24, 2020, 9:39 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయం ఈవో పోస్టు కోసం కొంతమంది అధికారులు జోరుగా పైరవీలు చేస్తున్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. గత కొంతకాలంగా భద్రాచలం రామాలయానికి రెగ్యులర్​ ఈవో లేరు. దేవాదాయ శాఖ స్పెషల్​ గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్​ రమాదేవి జులై మొదటి వారంలో ఇంఛార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత కొవిడ్​ పరిస్థితుల్లో ఆమె రెండుచోట్ల విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ పోస్టులోకి వచ్చేందుకు కొంతమంది సీనియర్​ అధికారులు పైరవీలు చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుత ఇంఛార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న రమాదేవి భద్రాచలం రామాలయ భూముల మీద దృష్టి కేంద్రీకరించారు. భూముల పర్యవేక్షణపై స్థానిక రెవిన్యూ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది జీతభత్యాలకు నెలకు రూ.కోటి అవసరం ఉండగా.. ఆదాయం మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.6కోట్ల నిధులు రాబట్టేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రామాలయం ఈవో బాధ్యతలు చేజిక్కించుకునేందుకు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పని చేసిన ఓ సీనియర్​ అధికారి రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలో పావులు కదుపుతున్నారని ఆలయ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. మరొకరు రెవెన్యూ శాఖలో మరో పది నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న సీనియర్​ అధికారి కావడం విశేషం. రాముల వారి సన్నిధిలో ప్రశాంతమైన ఈ కొలువును దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలే ఇక్కడి కార్యనిర్వహణకు పీకల్లోతు ఆర్థిక కష్టాలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట తరుణంలో ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్నవారిని నియమించే సాహసం చేస్తారా లేక ఇంకా సర్వీస్‌ ఉన్న దేవాదాయ శాఖలోని సీనియర్లకు అవకాశం ఇస్తారా.. లేక ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారినే కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ABOUT THE AUTHOR

...view details